X
முகப்பு சினி தரவரிசை

ఇప్పటివరకు తెలుగులో వచ్చిన టైమ్‌ ట్రావెల్‌ సినిమాలు ఇవే

Author Administrator | Updated: Thursday, April 27, 2023, 04:50 PM [IST]

ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. అందులో ఎన్నో జోనర్స్ కూడా ఉన్నాయి. అందులోని ఓ జోనర్ టైమ్ ట్రావెల్. ప్రేక్షకులు నచ్చే మెచ్చే జోనర్‌లలో ఒకటి 'టైమ్‌ ట్రావెల్‌' జోనర్‌. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే అంతా ఆశామాషీ కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్‌, బోలెడంత బడ్జెట్‌తో పాటు ప్రేక్షకుడిని కన్విన్స్‌ చేసేలా కూడా ఉండాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేశారు. ఇప్పటికి వరకు తెలుగు లో అలరించిన టైమ్‌ ట్రావెల్‌ మూవీస్ ఇవే


cover image
ఆదిత్య 369
1

ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన మూవీ ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇదే. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఆదిత్య 369 చిత్రం ఆగస్టు 18, 1991లో విడుదలైన  బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు.  ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఇప్పటికి రావటానికి కారణం ఈ సినిమానే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ఆదిత్య 999 సినిమా చేయబోతున్నట్లు గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి అప్‌డేట్‌ ఇ‍వ్వలేదు.     

24
2

తమిళ స్టార్‌ హీరో సూర్య మూడు విభన్న పాత్రలతో మెప్పించిన చిత్రం 24. ఈ సినిమాను వైవిధ‍్య చిత్రాల దర్శకుడు కె. విక్రమ్‌ కుమార్‌ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వాచ్‌ రిపేరర్‌, సైంటిస్ట్, విలన్‌గా సూర్య అదరగొట్టారు. 

ప్లే బ్యాక్
3

గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్‌ లైన్‌ ద్వారా కనెక్షన్‌ ఏర్పడితే ఎలా ఉంటుందనేదే 'ప్లే బ్యాక్‌' సినిమా. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ వద్ద పనిచేసిన హరిప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫోన్‌ కాల్స్‌ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని తెలిపేదే కథ. ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.   

అద్భుతం
4

తేజ సజ్జా, శివాని రాజశేఖర్‌ లీడ్‌ రోల్స్‌లో మాలిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం అద‍్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు ఒక ఫోన్‌ కాల్‌తో విరమించుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే మొబైల్‌ నంబర్‌తో ఫోన్‌ కాల్‌ వస్తుండంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా ప్రారంభమైన సినిమా వాళ్లిద్దరూ వేరు వేరు సంవత్సరంలో జీవిస్తున్నారని తెలుస్తుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ మూవీలో 26 సంవత‍్సరాలు టైమ్‌ గ్యాప్ ఉంటే ఇందులో ఐదేళ్ల గ్యాప్‌ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలను మార్చే నేపథ్యంతో సాగుతుందీ సినిమా. 

అ!
5

దర్శకుడిగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం ఆ !. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో నాని, ప్రశాంత్‌ తిపిర్నేని నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్‌, నిత్యా మీనన్‌, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియ దర్శిని, మురళి శర్మ నటించారు.   

బింబిసారా
6

విభిన్నమైన కాన్సెప్ట్ తో బింభిసార అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.టైం ట్రావెల్ ఫ్రం బ్యాడ్ టు గుడ్..బింబిసార ట్యాగ్ లైన్ ఇది. ఈ కథ సారమంతా ఈ లైన్లోనే ఉంది. అధికార దాహంతో.. అహంకారంతో మిడిసిపడే ఒక రాజు కాలంలో ప్రయాణించి వర్తమానంలోకి రావడం.. ఇక్కడ మంచి మనిషిగా మారి తన జీవితానికి ఒక పరమార్థం ఉండేలా మంచి చేసి తన కథకు ముగింపు ఇవ్వడం.. ఇదీ సింపుల్ గా బింబిసార సారాంశం. ఐతే కాగితం మీద సింపుల్ గా కనిపించే ఈ కాన్సెప్ట్ ను తెరపై రెండున్నర గంటల సినిమాగా ప్రెజెంట్ చేయడం అంత తేలిక కాదు. కొత్త దర్శకుడు అయినప్పటికీ వశిష్ఠ ఈ పనిని విజయంతంగా చేయగలిగాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+